Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జియో వినియోగదారులకి శుభవార్త.. రేపే ఫ్లాష్ సేల్‌!

  • రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్‌
  • జియో అధికారిక వెబ్‌సైట్ లో లభ్యం
  • జియో ఫోన్ 2 వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్ లు 
టెలికాం రంగంలో సంచలనాలను సృష్టిస్తోన్న జియో వినియోగదారులకి శుభవార్త. 'జియో ఫోన్ 2' కొనాలనుకునే వారి కోసం రిలయెన్స్ కంపెనీ ఫ్లాష్ సేల్‌ తేదిని ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జియో అధికారిక వెబ్‌సైట్ లో ఈ ఫ్లాష్ సేల్‌ ఉంటుంది. దీని ధర రూ.2999గా ఉంది. అలాగే, జియో ఫోన్ 2 వినియోగదారుల కోసం కంపెనీ రూ.49, రూ.99, రూ.153 పేరిట ప్రత్యేకమైన ప్లాన్ లని ప్రకటించింది.

జియో ఫోన్ 2 ప్రత్యేకతలు:

  • 4జీ ఫీచర్‌‌, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై
  • 2.4" హారిజాంటల్ డిస్‌ప్లే తో పాటు క్వర్టీ కీప్యాడ్
  • జీపీఎస్‌తో పాటు ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్, వాట్సప్
  • 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు)
  • 2000ఎంఏహెచ్ బ్యాటరీ
  • వెనక భాగంలో 2 మెగాపిక్సల్ కెమెరా
  • ముందు భాగంలో వీజీఏ సెల్ఫీ కెమెరా
jio
jio phone 2
Tech-News
Hyderabad

More Telugu News